×

Telangana:   తెలంగాణ‌లో రాజ‌కీయ వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా వేడెక్కింది. అటు గ్రూప్ 1 నిర‌స‌నకు మ‌ద్ద‌తుగా .. ఇటు హిందు దేవాల‌యాల‌పై దాడిని నిర‌సిస్తూ బీజేపీ నేత‌లు రోడెక్కారు. దీంతో రాష్ట్రంలో రాజ‌కీయం రంజుగా మారింది. జీవో 29 ను ర‌ద్దు చేయాలంటూ కేంద్ర‌హొం శాఖ స‌హాయమంత్రి బండిసంజ‌య్ కుమార్ , గ్రూపు 1 అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా అశోక్ న‌గ‌ర్ నుంచి సెక్ర‌టేరియ‌ట్ వ‌ర‌కు ర్యాలీగా వెళ్లారు. ఈక్ర‌మంలో ఆయ‌న‌ను పోలీసులు అదుపులోకి తీసుకోవ‌డంతో ప‌రిస్థితి ఉద్రిక్త‌త‌కు దారితీసింది. దీనికి తోడు హిందూ దేవాల‌యాల మీద దాడిని నిర‌సిస్తూ బీజేపీ కార్య‌క‌ర్త‌లు చేప‌ట్టిన శాంతియుత ర్యాలీ ర‌ణ‌రంగంగా మారింది.

కాగా  కేంద్ర‌హోంశాఖ స‌హ‌య‌మంత్రి బండిసంజ‌య్ కుమార్ గ్రూపు 1 అభ్య‌ర్థుల‌కు మ‌ద్ద‌తుగా ర్యాలీ నిర్వ‌హించారు. గ్రూపు 1 అభ్య‌ర్థుల‌తో క‌లిసి అశోక్ నగర్  నుంచి సెక్ర‌టేరియ‌ట్ వ‌ర‌కు ర్యాలీగా న‌డిచివెళ్లారు. జీవో29 ర‌ద్దు చేయాల‌ని, గ్రూపు 1 ప‌రీక్ష‌ను రీషెడ్యూల్ చేయాల‌ని బండి డిమాండ్ చేశారు.ఆయ‌న వెంట వేలాదిమంది నిరుద్యోగులు పోలీసుల వ‌ల‌యాన్ని చేధించుకుంటూ న‌డిచారు. అయితే ప‌రిస్థితి చేయిదాట‌డంతో కేంద్ర‌మంత్రిని పొలీసులు అదుపులోకితీసుకున్నారు.కార్య‌క‌ర్త‌లు అడ్డుప‌డుతున్నప్ప‌టికీ బ‌ల‌వంతంగా ఆయ‌న కారులోకి ఎక్కించారు.సీఎం రేవంత్ డౌన్ డౌన్ అంటూ కార్యకర్తలు నినాదాలు చేశారు.

ఇక దేవాల‌యాల మీద దాడిని నిర‌సిస్తూ సికింద్రాబాద్ ప‌రిధిలో హిందూ సంఘాలు చేప‌ట్టిన శాంతియుత ర్యాలీ ర‌ణ‌రంగంగా మారింది. శాంతియుతంగా ధ‌ర్నాచేస్తున్న బీజేపీ కార్య‌క‌ర్త‌ల‌పై పోలీసులు లాఠీ చార్జీ చేయ‌డంతో వాతావ‌ర‌ణం ఒక్క‌సారిగా ఉద్రిక్తకు దారి తీసింది.
ఈఘ‌ట‌న‌లో ప‌లువురు కార్య‌క‌ర్త‌ల‌కు తీవ్ర గాయాలు అయ్యాయి. Rajendra ,etala, etala rajendraఇదిలా ఉంటే హిందూ దేవాల‌యాల‌పై జ‌రుగుతున్న దాడులు కుట్ర‌లో భాగ‌మేన‌ని ఎంపీ ఈట‌ల రాజేంద‌ర్ ఆరోపించారు. ఓట్ల కోసం శాంతికి విఘాతం క‌ల్పించే వారిని ప్రోత్స‌హిస్తే..పాముకు పాలుకు పోసిన‌ట్లేన‌ని హెచ్చ‌రించారు. ఈవిష‌యంలో ప్ర‌భుత్వం తాత్సార్యం చేయ‌కుండా దాడుల‌ను అడ్డుకోవాల‌ని విజ్ఞ‌ప్తి చేశారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి...

Read out all

crime: ఒక్క క్లిక్‌తో మొదలై… జీవితాన్ని కుదేలు చేసే మోసాలు..!!

Socialmedia: సోషల్ మీడియా ప్రపంచంలో కనిపించే విలాసవంతమైన జీవితం చాలామందిని ఆకర్షిస్తోంది. ఖరీదైన కార్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, విదేశీ పర్యటనలు, బ్రాండెడ్ గిఫ్ట్స్… ఇవన్నీ సులభంగా దక్కుతాయనే భ్రమలో...

Read out all

cinima: “నా జీవితం తెల్లకాగితం.. మచ్చ పడనివ్వను”: మురళీమోహన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ‘మీట్ ది...

Read out all

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి....

Read out all

cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood: లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం.. తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి...

Read out all

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద...

Read out all
Optimized by Optimole