Telangana: పార్టీ ఫిరాయింపులపై ప్లేటు ఫిరాయిస్తున్న కాంగ్రెస్‌..!

Telangana politics: ప్రజలు ఒక పార్టీని గద్దె దించారంటే అది చేసిన అనేక తప్పిదాలు కారణాలవుతాయి. వారి స్థానంలో అధికారం చేపట్టిన పార్టీ ఆ పొరపాట్ల నుండి గుణపాఠాలు నేర్చుకొని వాటిని పునరావృతం చేయకుండా పాలిస్తే ప్రజాదరణ పొందుతారు. అలాకాక వారికంటే మేము నాలుగు ఆకులు ఎక్కువే తిన్నామంటూ ప్రత్యర్థులు నడచిన ప్రజావ్యతిరేక అడుగుజాడల్లోనే నడుస్తామంటే వీరిపై కూడా ప్రజాభిప్రాయం మారడం ఖాయం. పదేళ్ల కేసీఆర్‌ పాలనకు వ్యతిరేకంగా తీర్పు ఇచ్చిన తెలంగాణ ప్రజలు రేవంత్‌ సర్కారును అందలమెక్కిస్తే, కాంగ్రెస్‌ ఇప్పుడు బీఆర్‌ఎస్‌ విడిచిన చెప్పులనే వేసుకుంటూ, వారి బాటలోనే నడుస్తోంది. తెలంగాణలో కేసీఆర్‌కు ఓటర్లు రెండు సార్లు స్పష్టమైన మోజార్టీతో అధికారం అప్పగించినా విపక్షమే లేకుండా అంతా తానై పాలించాలనే ఆలోచనలతో ఆయన ప్రత్యర్థి పార్టీలను నిర్వీర్యం చేయాలని చూశారు. 2014లో 63 సీట్లతో బీఆర్‌ఎస్‌ను గెలిపించిన ప్రజలు 2018లో మరో 25 స్థానాల్లో అదనంగా గెలిపించి 88 సీట్లు కట్టబెట్టినా కేసీఆర్‌ సంతృప్తి చెందకుండా, ప్రతిపక్షం లేకుండా చేయాలనే ఉద్ధేశంతో వంద స్థానాల మార్కు దాటాలని లక్ష్యంగా పెట్టుకొన్నారు. ప్రజాతీర్పుకు భిన్నంగా ప్రతిపక్ష పార్టీల నుండి గెలిచిన ఎమ్మెల్యేలను తన పార్టీలో చేర్చుకునే కుట్రకు కేసీఆర్‌ తెరదీశారు. ప్రజాప్రతినిధులతో రాజీనామా చేయించి తమ పార్టీ తరఫున గెలిపించుకొని ప్రజాక్షేత్రంలో వారి బలాన్ని నిరూపించుకుంటే ఎలాంటి వివాదాలుండేవి కావు. కేసీఆర్‌ ఇందుకు భిన్నంగా చట్టంలోని లొసుగులను అనుకూలంగా మల్చుకొని 2018 తరువాత గంపగుత్తగా ప్రతిపక్ష ఎమ్మెల్యేలను బీఆర్‌ఎస్‌లో చేర్చుకున్నారు. పాలక పార్టీలో చేరితే నియోజకవర్గాన్ని మరింత అభివృద్ధి చేసుకోవచ్చనే నెపంతో పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేలు అధికారాన్ని అనుభవించారు. కొందరికి మంత్రి హోదా కూడా దక్కింది   బీఆర్‌ఎస్‌ చేసిన ప్రజావ్యతిరేక కార్యకలాపాలను లెక్కపెట్టుకున్న ప్రజలు సరైన సమయంలో సరైన తీర్పు ఇస్తూ ఆ పార్టీని ఓడిరచారు. ఆ అనుభవాలతో జాగ్రత్త పడాల్సిన రేవంత్‌ సర్కారు అందుకు భిన్నంగా పావులు కదుపుతోంది. అసెంబ్లీలో సంపూర్ణ మెజార్టీ కలిగున్న రేవంత్‌ సర్కారు అవసరం లేకపోయినా లోగడ తమను ఇబ్బంది పెట్టిన కేసీఆర్‌పై కక్ష తీసుకోవాలనే ఏకైక లక్ష్యంతో సాగుతోంది.  బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలు దానం నాగేందర్‌, కడియం శ్రీహరి, తెల్లం వెంకట్రావులను ఇప్పటికే పార్టీలో చేర్చుకున్న కాంగ్రెస్‌ మరింత మంది ఎమ్మెల్యేల వలసలను ప్రోత్సహించేందుకు ప్రయత్నిస్తోంది. బీఆర్‌ఎస్‌ను నిర్వీర్యం చేసేందుకు ఆ పార్టీలోని మెజార్టీ ఎమ్మెల్యేలను చేర్చుకొని న్యాయపరమైన చిక్కులు రాకుండా విలీనాన్ని సంపూర్ణం చేయాలని కాంగ్రెస్‌ అడుగులేస్తోంది. అధికారంలో ఉండి ఏమి చేసినా చెల్లుబాటయినా, ప్రజా కోర్టులో మాత్రం శిక్ష తప్పదు. పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల చరిత్రను చూస్తే ఈ విషయం స్పష్టం అవుతోంది. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో పార్టీ ఫిరాయించిన 14 మంది ఎమ్మెల్యేలకు బీఆర్‌ఎస్‌ తిరిగి టికెట్లిస్తే వారిలో మహేశ్వరంలో సబితా ఇంద్రారెడ్డి, ఎల్బీనగర్‌లో సుధీర్‌ రెడ్డి మాత్రమే గెలవగా మిగతా 12 మంది ఓడిపోయారు. అధికార దాహంతో ఫిరాయించే ఎమ్మెల్యేలతో పార్టీలో గ్రూపు రాజకీయాలకు నాందిపలికినట్టేనని గతనుభవాలే నిరూపిస్తున్నాయి. లోగడ కాంగ్రెస్‌ నుండి బీఆర్‌ఎస్‌లో చేరిన ఎమ్మెల్యేలతో సదరు నియోజకవర్గాల్లో ఆధిపత్య పోరు కేసీఆర్‌ సర్కారు పుట్టిముంచాయి….

Read Full News

munuudireview: ‘అరబ్బీ నిఖా’ బలిపశువులు మహిళలే.. మతాధికారులపై కత్తి ఎత్తిన రుఖియా కథ..!

విశీ( సాయి వంశీ) : ” మతం అంచుల అవతల ‘అరబ్బీ నిఖాలు’”  ఈ విశ్వంలో ప్రకృతి ఉంది. ఈ భూమిపై మతం ఉంది. ప్రకృతికి కొన్ని నియమాలు ఉన్నాయి. మతంలో కొన్ని నిబంధనలు ఉన్నాయి. శారీరక వాంఛలు తీర్చుకోవడానికి ఒక జీవి మరో జీవితో సమాగమించొచ్చు అంటుంది ప్రకృతి. అది దాని నియమం. పెళ్లి కాని ఇద్దరు స్త్రీ, పురుషులు శారీరకంగా కలిస్తే అది వ్యభిచారం అంటుంది మతం. రెండింటికీ భూమి ఆకాశాల నడుమ ఉన్నంత…

Read Full News

APpolitics: ‘‘బాబే మారెనా…? ప్రజలనేమారెనా??’’

APpolitics:  ‘మారింది మారింది కాలం…. మారింది మారింది లోకం… ఎక్కడ మారిందమ్మా…? ఇంకా దిగజారిందమ్మా…..!’ అనే సినీ గీతమొకటి  డాక్టర్ సి.నారాయణరెడ్డి రాసింది తెలుగునాట బాగా ప్రసిద్ది. తాను మారానని, మారిన మనిషినని చంద్రబాబునాయుడు ఇటీవల పదే పదే చెబుతున్నారు. బాబు నిజంగా మారారా? నమ్మడానికి మన మనసు అంత తేలిగ్గా అంగీకరించదు. ఎందుకంటే, ఇది ఆయన కన్నా, ఇతరులు చెబితేనే నమ్మాలి. కానీ, ఇప్పటివరకు ఇతరులెవరూ ఆ ముక్క చెప్పట్లేదు. ఆయనే చెబుతున్నారు. ‘మారిన చంద్రబాబును…

Read Full News

spremdonar: ‘వీర్యదానం’ కొన్ని అపోహలు – కొన్ని నిజాలు ..!

విశీ ( సాయి వంశీ):  గతంలో ఏమైనా వచ్చాయో, లేదో తెలియదు కానీ, 2012లో హిందీలో వచ్చిన ‘విక్కీ డోనర్’ సినిమా Sperm Donation గురించి విస్తృతమైన చర్చకు ఆస్కారం ఇచ్చింది. ‘వీర్యదానం’ అనే అంశాన్ని సాధారణీకరించేలా చేసేందుకు చాలా ఉపయోగపడింది. ఆ సినిమాను ఆ తర్వాత ‘నరుడా డోనరుడా’ పేరిట తెలుగులో, ‘ధారాళ ప్రభు’ పేరిట తమిళంలో తీశారు. తెలుగులో ఫ్లాప్, తమిళంలో యావరేజ్‌గా ఆ సినిమాలు నిలిచాయి. ఆ తర్వాత ఈ మధ్య కాలంలో…

Read Full News

Rahulgandhi: రాహుల్‌ కి ముత్తాత నెహ్రూ జీ సాలు వస్తే మరో మూడేళ్లలో ప్రధాని పదవి!

Nancharaiah merugumala senior journalist:  కాంగ్రెస్‌ ఏకైక అగ్రనేత రాహుల్‌ గాంధీకి బుధవారం 54 ఏళ్లు నిండిపోయాయి. ఆయన ముత్తాత (‘గ్రేట్‌’ గ్రాండ్‌–ఫాదర్‌!) పండిత జవాహర్‌ లాల్‌ నెహ్రూ 57 ఏళ్ల ఆర్నెల్ల వయసు దాటాక భారత తొలి ప్రధానిగా (అది తాత్కాలిక జాతీయ ప్రభుత్వమే గాని పదవి పదవే కదా!) 1947 ఆగస్టు అర్థరాత్రి పదవిని చేపట్టారు. ఆయన తండ్రి రాజీవ్‌ గాంధీ 1984లో అక్టోబర్‌లో 40 సంవత్సరాల వయసులో భారత ప్రధాని అయ్యారు. తల్లి…

Read Full News

Ramojirao: ‘రామోజీ రావుకు భారతరత్న’ డిమాండ్‌..ఒడిశా ఎమ్మెల్యే మద్దతు..!

Nancharaiah merugumala senior journalist: ‘రామోజీ రావుకు భారతరత్న’ డిమాండ్‌ కమ్మ మాజీ ఎంపీ నుంచి ఒడిశా తెలుగు యాదవ ఎమ్మెల్యే వరకూ మద్దతు..! ‘ఈనాడు’ స్థాపకుడు చెరుకూరి రామోజీరావు గారు కన్నుమూసి 10 రోజులు దాటక ముందే ఈ దివంగత తెలుగుతేజానికి దేశ అత్యున్నత పౌరపురస్కారం ‘భారతరత్న’ ఇవ్వాలనే డిమాండు ఊపందుకుంటోంది. మొదట ఆదివారం హైదరాబాద్‌ అమీర్‌ పేట కమ్మసంఘం హాలులో తెలుగు కమ్మ ప్రముఖులు జరిపిన సంతాపసభలో రాజమండ్రి మాజీ ఎంపీ, కమ్మ వ్యాపారవేత్త…

Read Full News

‘‘అన్న క్యాంటిన్ల’’కు ‘‘డొక్కా సీతమ్మ’’ పేరు పెట్టాలి: లోక్ సత్తాభీశెట్టి బాబ్జి బహిరంగ లేఖ

Apnews:  ‘‘అన్న క్యాంటిన్ల’’కు ‘‘డొక్కా సీతమ్మ’’ పేరు పెట్టాలని కోరుతూ ఏపీ ముఖ్యమంత్రి నారాచంద్రబాబునాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్‌కళ్యాణ్‌ కి లోక్‌సత్తా పార్టీ రాష్ట్ర అధ్యక్షులు భీశెట్టి బాబ్జి బహిరంగ లేఖ రాశారు. రాష్ట్రంలో ఎన్డీయే ప్రభుత్వం కొలువుదీరగానే ‘‘అన్న క్యాంటిన్ల’’ ను ఏర్పాటుకి సంబంధించిన ఫైల్స్ పై సంతకం చేయడం శుభపరిణామమని ఆయన అన్నారు. పేదల ఆకలి తీర్చడానికి ప్రారంభిస్తున్న క్యాంటిన్లకు స్వర్గీయ నందమూరి తారకరామారావు (అన్నగారు) పేరు పెట్టడం హర్షించదగ్గ విషయమన్నారు. క్యాంటిన్లకు ‘‘అన్న…

Read Full News

Rahulgandhi: ప్రియాంక- రాహుల్‌ మాదిరి..షర్మిల, జగన్‌ మధ్య ‘ అనురాగబంధం’ ఎప్పుడు పుట్టేనో..!

Nancharaiah merugumala senior journalist: ” ప్రియాంక వారణాసిలో పోటీచేస్తే మోదీ ఓడిపోయేవారన్న రాహుల్‌.. ! షర్మిల, జగన్‌ మధ్య కూడా ఇలాంటి ‘అన్నాచెల్లెళ్ల అనురాగబంధం’ ఎప్పుడు పుట్టేనో..! “ చెల్లి ప్రియాంకపై అన్న రాహుల్‌ కు ఈ విశ్వాసం మార్చి 16కు ముందు ఉండి ఉంటే.. కాంగ్రెస్‌ లోక్‌ సభలో సెంచరీ మిస్సయ్యేది కాదేమో. తమ కుటుంబ ‘పాత సొంత’ నియోజకవర్గం అమేఠీలో కాంగ్రెస్‌ అభ్యర్ధి కిశోరీలాల్‌ శర్మను గెలిపించినందుకు ఓటర్లకు ధన్యవాదాలు చెప్పడానికి మంగళవారం…

Read Full News

Gvl: ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి?

Nancharaiah merugumala senior journalist: ” మెదడును సరిగ్గా వాడుకుని బాబు కేబినెట్లో మంత్రి దాకా ఎదిగిన ‘యాదవ’ సత్యాను చూసైనా నేర్చుకోవయ్యా, అని ‘నియోగ’ జీవీఎల్‌ నరసింహారావుకు ఎవరు చెప్పాలి? “ మొన్నటి ఏప్రిల్‌ నెల వరకూ సత్యకుమార్‌ యాదవ్‌ అంటే గత కొన్నేళ్లుగా ఆంధ్రజ్యోతి దినపత్రిక ఎడిటోరియల్‌ పేజీలో ప్రతి వారం నిలువు వ్యాసం రాసే (అది కూడా వై.సత్యకుమార్‌ పేరుతో) బీజేపీ నేతగానే తెలుసు. తర్వాత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రక్రియ మొదలయ్యే…

Read Full News
Optimized by Optimole