SitaramYechury: సీతారాం ఏచూరి కన్నుమూత..!

National:  సిపిఎం జాతీయ ప్రధాన కార్యదర్శి సీతారాం ఏచూరి (72) కన్నుమూశారు. గత నెల 19 నుంచి ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్తో ఆయన బాధపడుతున్నారు. ఢిల్లీలోని ఎయిమ్స్ లో చికిత్స పొందుతున్న ఆయన తుది శ్వాస విడిచినట్లు వైద్యులు తెలిపారు. ఏచూరి మరణ వార్తతో కమ్యూనిస్టు వర్గాల్లో తీవ్ర విషాదం నెలకొంది

Read More

తెలుగు రాష్ట్రాల్లో స్వల్పంగా కరోనా కేసులు నమోదు..

తెలుగు రాష్ట్రాల్లో కరోనా ఉధృతి కొనసాగుతోంది. అటు తెలంగాణలో 25వేల 21 కరోనా నిర్ధారణ పరీక్షలు నిర్వహించగా, 121 పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. గ్రేటర్‌లోనే 55 మందికి కరోనా పాజిటివ్ కేసులు వెల్లడయ్యాయి. కరోనా వైరస్ తో ఒకరు మృతి చెందారు.అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకోగా,అదే సమయంలో 183 మంది కరోనా నుంచి కోలుకున్నారు. ఇక ఏపీలో 39వేల 848 శాంపిల్స్ పరీక్షించగా, 385 మందికి కరోనా పాజిటివ్ అని నిర్ధారణ అయింది….

Read More

janasena: డిప్యూటీ సీఎం దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మహాయాగం..

Nadendlamanohar: ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రాయశ్చిత్త దీక్షకు సంఘీభావంగా మంత్రి నాదెండ్ల మనోహర్ మహా యాగం నిర్వహించారు.తెనాలిలోని వైకుంఠపురం దేవాలయంలో సోమవారం ఉదయం 11 గం. నుంచి మహా యాగం చేశారు. ఈ కార్యకమంలో పాల్గొని ధార్మిక విధులు నిర్వర్తించారు. అనంతరం నాదెండ్ల మనోహర్ మాట్లాడుతూ “తిరుమల ప్రసాదాన్ని భక్తులు పరమ పవిత్రంగా భావిస్తారు. లడ్డూ తయారీలో కల్తీని కలలో కూడా ఊహించలేము. ఈ ఘటనపై ప్రతి ఒక్కరిలో వేదన ఉంది. గౌరవ ఉప…

Read More

రైతు ఉద్యమం పై సోషల్ వార్!

రైతుల ఉద్యమానికి అనూహ్య రీతిలో సోషల్ మీడియా వేదికగా వార్ మొదలైంది. ప్రఖ్యాత అంతర్జాతీయ సెలబ్రిటీలు , పాప్ సింగర్ రిహానా, పర్యావరణ ప్రేమికురాలు గ్రేటా థన్ బర్గ్ , అమెరికా కాంగ్రెస్ అధ్యక్షుడు జిమ్ కోస్టాలతో పాటు పలువరు ప్రముఖులు రైతులకు మద్దతు తెలుపుతూ ట్వీట్ చేశారు. దీంతో అప్రమత్తమైన కేంద్రం వెంటనే రంగంలోకి దిగి ఎదురు దాడి మొదలు పెట్టింది. కేంద్ర మంత్రులు, అమిత్ షా, స్మృతి ఇరానీ, ఎస్. జయశంకర్, నిర్మలా సీతారామన్,…

Read More

సంకట హర చతుర్ధి వ్రత కథ..

గణపతి అత్యంత ప్రీతిస్పాత్రమైన తిధులలో ప్రధానమైనది చవితి తిది. అమావాస్య తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను వరదచతుర్థి అని, పౌర్ణమి తరువాత వచ్చే చతుర్థిరోజున చేసే వ్రతంను సంకటహర చతుర్థి వ్రతం అంటారు. వ్రత కథ: ఒకానొకనాడు ఇంద్రుడు తన విమానంలో బృఘండి అనే ఋషి దగ్గర్నించి ఇంద్రలోకానికి తిరిగి వెళుతుం డగా ఘర్‌సేన్‌ అనే రాజు రాజ్యం దాటే సమయంలో, అనేక పాపములు చేసిన ఒకానొక వ్యక్తి ఆకాశంలో పయనించే ఆ విమానం పై…

Read More

ఎట్టకేలకు ఓబీసీ మాలీ గహలోత్ కు కాంగ్రెస్ అధ్యక్ష పదవి!

  Nancharaiah merugumala (senior journalist) ————————/————————————————– బిహార్ ఓబీసీ వైశ్యుడి (సీతారామ్ కేసరీ) నుంచి పార్టీ అధ్యక్ష పదవిని 1998లో సోనియాగాంధీ గుంజుకున్నారు. 24 సంవత్సరాల తర్వాత ఆమె మారు మనసు పొందారు. కొడుకు రాహుల్ సహకారంతో కాంగ్రెస్ అధ్యక్ష పదవిని తిరిగి ఓబీసీ నేత అశోక్ గహలోత్ కు అప్పగిస్తున్నారు నెహ్రూ-గాంధీ కుటుంబ సభ్యులు. ప్రస్తుతం రాజస్థాన్ ముఖ్యమంత్రి పదవిలో 2018 నుంచీ కొనసాగుతున్న అశోక్ గహలోత్ ఓబీసీ మాలీ కులానికి చెందిన నేత….

Read More

బాబు రీ ఎంట్రీ బలమా? బలహీనతా?

   ఎవరికి వరం? ఎవరికి శాపం? ‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకొచ్చింది’ అన్నట్టుంది తెలంగాణలో పాలక విపక్షాల నడుమ రాజకీయం. తెలంగాణ రాజకీయాల్లోకి తెలుగుదేశం నేత చంద్రబాబునాయుడు పునరాగమనం… పెద్ద చర్చనే లేవనెత్తింది. తెలంగాణ కాంగ్రెస్‌తో జతకట్టిన ఆయన రాక 2018లో సీఎం చంద్రశేఖరరావుకు అయాచిత లాభం చేకూర్చింది. అదే చంద్రబాబు ఇప్పుడు బీజేపీతో జతకట్టి వస్తే కేసీఆర్‌కు, ఆయన బీఆర్‌ఎస్‌కు నష్టం కలిగిస్తారనే అంచనాలు రాజకీయ వర్గాల్లో సాగుతున్నాయి. ప్రభావమేమీ ఉండదని, పైగా పాలకపక్షానికే లాభమని…

Read More

వేట మొదలైంది…. వేటాడానికే పులి వచ్చింది: బండి సంజయ్

BJPTelangana:‘‘ కేసీఆర్ నన్ను అక్రమంగా అరెస్ట్ చేసి 8 గంటలు రోడ్లపై తిప్పారు. అప్పుడు కార్యకర్తలకు నేనొక్కటే చెప్పిన….  మీరేం భయపడకండి… ఢిల్లీ నుండి ఫోన్ చేసింది. పులి వస్తోంది. వేట మొదలైంది. వెంటాడటం ప్రారంభించింది. ఆ పులి కార్యకర్తలను కాపాడే పులి. ఆ పులే చేవెళ్ల గడ్డకు వచ్చింది. ఆ పులికి అందరూ లేచి స్వాగతం పలికండి’’అంటూ రెచ్చిపోయారు బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు, ఎంపీ బండి సంజయ్ కుమార్. ఆదివారం  చేవెళ్ల జరిగిన ‘‘విజయ సంకల్ప…

Read More

Reservations: ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్ల మీద ఏడుపు – కొన్ని నిజాలు ..!!

విశీ (వి.సాయివంశీ):    మనకు తెలిసి కొన్నిసార్లు, తెలియక ఇంకొన్నిసార్లు మనలో కొన్ని భ్రమలు పేరుకుపోతాయి. అవే వాస్తవాలు అనిపిస్తాయి. అవి అబద్ధాలని తెలిసినా ఒప్పుకోలేని స్థితికి మనల్ని చేరుస్తాయి. ఆ భ్రమలే నిజాలన్న నమ్మిక మనలో ఏర్పరుస్తాయి. ఏ సామాజిక సర్వేలు చూడక, ఏ సాంఘిక జీవనాన్ని పరిశీలించక ఆ ఊహల్లోనే బతకడం నేర్పిస్తాయి. కానీ నిజం నిప్పు లాంటిది. నివురును చీల్చుకుంటూ బయటికి రాక తప్పదు. సుధామూర్తి గారి ‘మాంసాహార ఛాయిస్’పై చర్చ జరుగుతోంది….

Read More
Optimized by Optimole