×

విశీ(వి.సాయివంశీ):

హీరోయిన్‌పై లైంగికదాడి.. ఏళ్లు గడిచినా న్యాయానికి ఎదురుచూపులే! (THE KERALA STORY)

2017 ఫిబ్రవరి.. కేరళ రాష్ట్రం కొచ్చిలోని నెండుంబసేరిలో దారుణం జరిగింది. దక్షిణాది సినిమాల్లో నటిస్తున్న ప్రముఖ హీరోయిన్ భావన(‘ఒంటరి’, ‘మహాత్మ’ ఫేం)(బాధితురాలి పేరు బయటపెట్టకూడదు. కానీ ఆమె స్వయంగా బయటకు వచ్చి చెప్పింది కాబట్టి తప్పు లేదు)ను కొందరు గుర్తుతెలియని వ్యక్తులు ఓ కారులో ఎక్కించుకున్నారు. ఆమెపై లైంగిక వేధింపులకు పాల్పడ్డారు. కొంతదూరం వెళ్లాక ఆమెను వదిలేశారు. ఈ అంశం దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించింది. దీనిపై ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. నాలుగు నెలల తర్వాత ఈ కేసు కీలక మలుపు తిరిగింది. మలయాళ హీరో దిలీప్ తెరపైకి వచ్చారు. ఈ ఘటన వెనుక కీలక సూత్రధారిగా ఆయనే ఉన్నారని తేల్చారు. 1992 నుంచి ఆయన మలయాళ సినీరంగంలో ఉన్నారు. మంజు వారియర్ అనే నటిని పెళ్లి చేసుకుని, విడాకులిచ్చి, ఆ తర్వాత కావ్య మాధవన్‌ అనే మరో హీరోయిన్‌ని పెళ్లి చేసుకున్నారు.

దిలీప్ ఈ పనిచేయించారని అనుమానించిన అధికారులు ఆయన్ని విచారణకు పిలిచారు. తనకు ఈ విషయంతో సంబంధం లేదని, నిజానికి భావనే తన మీద లేనిపోనివి చెప్తోందని, తనకు వివాహేతర సంబంధం ఉందని ప్రచారం చేస్తానని బెదిరిస్తోందని ఆయన అధికారులకు చెప్పారు. మూడు నెలలు జైల్లో ఉన్న దిలీప్ ఆ తర్వాత బెయిల్‌పై బయటికి వచ్చారు. ఈ కేసు ప్రస్తుతం సుప్రీంకోర్టులో ఉంది. విచిత్రమేమిటంటే, భావనపై ఈ ఘటన జరిగింది 2017లో అయితే 2023 దాకా ఆమెకు మలయాళ సినిమాల్లో అవకాశాలు రాలేదు. అనధికారికంగా ఆమెను ఆ ఇండస్ట్రీ నుంచి దూరం పెట్టారు.

ఆ సమయంలో కేరళ ప్రభుత్వం హైకోర్టు విశ్రాంత న్యాయమూర్తి హేమ ఆధ్వర్యంలో ఒక కమిటీని వేసింది. ఇందులో తెలుగు నటి శారదతోపాటు విశ్రాంత ఐఏఎస్ అధికారిణి కె.బి.వత్సలకుమారి ఉన్నారు. మలయాళ సినీరంగంలో నటీమణులు, మహిళా నిపుణులు పడుతున్న ఇబ్బందులు, భద్రతా ప్రమాణాల గురించి విచారించి నివేదిక అందించాలని ప్రభుత్వం తెలిపింది. 2019 డిసెంబరులో అప్పటి కేరళ సీఎం పినరయి విజయన్‌కి కమిటీ 300 పేజీల నివేదికను అందించింది.

ఆ నివేదికను ప్రభుత్వం బహిర్గతం చేయకుండా 2022 జనవరిలో మరో కమిటీని వేసి ఆ నివేదికలోని అంశాలు, వాటి ఆచరణను పరిశీలించమని తెలిపింది. హేమ కమిటీ ఇచ్చిన నివేదికను బహిర్గతం చేయాలని, దాన్ని అందరికీ అందుబాటులోకి తేవాలని కేరళకు చెందిన Women in Cinema Collective(WCC) సభ్యులు కోరినా ప్రభుత్వం స్పందించలేదు. ఆ నివేదికకు సంబంధించి ఏం చర్యలు తీసుకున్నారో కూడా చెప్పలేదు.

జులైలో సమాచార హక్కు చట్టంలో భాగంగా ఆ నివేదిక కావాలంటూ కొందరు దరఖాస్తు చేసుకున్నారు. సజీ పరయిల్ అనే నిర్మాత ఈ విషయంలో హైకోర్టును ఆశ్రయించి, ఎవరికీ ఆ నివేదిక ఇవ్వకూడదంటూ పిటీషన్ వేశారు. దాంతో హైకోర్టు స్టే విధించింది. మంగళవారం ఆ పిటీషన్‌ను విచారించిన హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.జి.అరుణ్ ఆ స్టేని ఎత్తేశారు. అనంతరం ఆయన కీలక వ్యాఖ్యలు చేశారు.

‘సమస్యను పరిష్కరించడం ద్వారా స్త్రీలకు భద్రత లభిస్తుంది తప్ప, ఆ సమస్యను కప్పిపుచ్చడం వల్ల సమస్య తీరదని’ వివరించారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన కమిటీ తాలూకు నివేదికలో ఏముందో ప్రజలు తెలుసుకోవడంలో తప్పేం ఉందని ప్రశ్నించారు. వారంలోగా ఆ నివేదికను ప్రచురించి, దాన్ని కోరిన వారికి అందించాలని పేర్కొన్నారు.

హేమ కమిటీ నివేదిక ప్రకారం.. సినిమాల్లో పనికి తప్పకుండా కాంట్రాక్ట్ రాయించుకోవాలని, స్త్రీ, పురుషులకు సమానమైన వేతనం ఇవ్వాలని, షూటింగ్ లొకేషన్లలో మద్యం, డ్రగ్స్ వాడటాన్ని నిషేధించాలని, మహిళలకు రక్షణగా సిబ్బందిని ఏర్పాటు చేయాలని.. ఇలా పలు సూచనలు చేశారు.

Author

dhoni.raju219@gmail.com

Related Posts

crime: క్షణికానందం కోసం కుటుంబాల నాశనం!

Hyderabad: By Amaravaji Nagaraju ✍🏽 ఒకప్పుడు సమాజంలో పేరు సంపాదించాలంటే ప్రతిభ ఉండాలి… కష్టపడాలి… విలువలు పాటించాలి. ఇప్పుడు పరిస్థితి మారిపోయింది. కొన్ని సెకన్ల వీడియోతో కోట్ల మందికి...

Read out all

crime: ఒక్క క్లిక్‌తో మొదలై… జీవితాన్ని కుదేలు చేసే మోసాలు..!!

Socialmedia: సోషల్ మీడియా ప్రపంచంలో కనిపించే విలాసవంతమైన జీవితం చాలామందిని ఆకర్షిస్తోంది. ఖరీదైన కార్లు, ఫైవ్ స్టార్ హోటళ్లు, విదేశీ పర్యటనలు, బ్రాండెడ్ గిఫ్ట్స్… ఇవన్నీ సులభంగా దక్కుతాయనే భ్రమలో...

Read out all

cinima: “నా జీవితం తెల్లకాగితం.. మచ్చ పడనివ్వను”: మురళీమోహన్

హైదరాబాద్: కేంద్ర ప్రభుత్వం ప్రకటించిన పద్మశ్రీ పురస్కారం సందర్భంగా ప్రముఖ నటుడు, నిర్మాత మురళీమోహన్ను తెలుగు ఫిలిం క్రిటిక్స్ అసోసియేషన్ ఘనంగా సన్మానించింది. ఫిలిం ఛాంబర్‌లో నిర్వహించిన ‘మీట్ ది...

Read out all

cinima: “కావ్య మారన్ – అనిరుధ్ పెళ్లి.. నిజమేనా?”

Kollywood: కోలీవుడ్ స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్.. సన్‌రైజర్స్ హైదరాబాద్ సీఈఓ కావ్య మారన్.. గత కొంతకాలంగా వీరిద్దరి పేర్లు ప్రేమ, పెళ్లి వార్తలతో సోషల్ మీడియాలో మారుమోగుతున్నాయి....

Read out all

cinima: తెలంగాణ నేటివిటీకి అద్దం పట్టే ‘ఇడుపు కాయితం’

Tollywood: లోకేష్ కనకరాజ్ చేతుల మీదుగా ఘనంగా ప్రారంభమైన సుకుమార్ రైటింగ్స్ – బన్నీ వాస్ వర్క్స్ చిత్రం.. తెలంగాణ కుటుంబాల భావోద్వేగాలు, ఆచార వ్యవహారాలు, బంధాల మధ్య దాగి...

Read out all

Cinima : రామ్ గోపాల్ వర్మ ‘రక్త చరిత్ర’ రీ రిలీజ్

Tollywood: మాఫియా, హారర్, సస్పెన్స్ చిత్రాలను తీయడంతో పాటు యథార్థ ఘటనల నేపథ్య చిత్రాలను తెరకెక్కించడంలో రామ్ గోపాల్ వర్మది ఓ ప్రత్యేక శైలి. ఒకప్పుడు రాయలసీమ ఫ్యాక్షనిజంలో బద్ద...

Read out all
Optimized by Optimole