తెలంగాణ ఎన్నికల్లో కింగ్ మేకర్ “మైనార్టీలు’…

telanganaelections2023:  తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లీంలు కీలకం కాబోతున్నాారా అంటే అవుననే సమాధానం  వినిపిస్తోంది. పీపుల్స్‌పల్స్‌ సంస్థ బృందం అధ్యయనం ప్రకారం.. రాష్ట్రంలో 12 శాతానికి పైగా ఉన్న మైనార్టీలు రానున్న ఎన్నికల్లో కింగ్ మేకర్ అనడంలో ఎటువంటి సందేహం లేదని తేలింది.గత ఎన్నికల గణాంకాలు సైతం అదే విషయాన్ని స్పష్టం చేస్తున్నాయి. దీంతో ముస్లింలను మచ్చిక చేసుకునేందుకు ప్రధాన పార్టీలైన బీఆర్‌ఎస్‌, కాంగ్రెస్‌ పార్టీలు ప్రణాళికలు రూపొందిస్తున్నాయి.  మరి అసెంబ్లీ ఎన్నికల్లో ముస్లిం ఓటర్లు స్థానిక…

Read More

కాంగ్రెస్ ను గెలిపిస్తే ఆదిలాబాద్ జిల్లాను దత్తత తీసుకుంటా: రేవంత్ రెడ్డి

Telanganaelections2023: తెలంగాణలో త్వరలో జరగనున్న ఎన్నికల్లో కాంగ్రెస్‌ను గెలిపిస్తే ఆదిలాబాద్‌ జిల్లాను అభివృద్ధి పథంలో నడిపిస్తామని టీపీసీసీ అధ్యక్షుడు రేవంత్‌ రెడ్డి అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం ఆదిలాబాద్‌ జిల్లా బోథ్‌లో నిర్వహించిన కాంగ్రెస్‌ విజయభేరి సభలో ఆయన మాట్లాడారు. పార్టీ నష్టపోతుందని తెలిసినా సోనియాగాంధీ ప్రత్యేక రాష్ట్రం ఇచ్చారన్నారు. ఆత్మహత్యలు చేసుకున్న విద్యార్థుల కుటుంబాలను కేసీఆర్‌ పరామర్శించలేదని రేవంత్‌ ఆరోపించారు.  “తెలంగాణ వచ్చి పదేళ్లయినా బోథ్ కు నీళ్లేందుకు రాలేదు? ఇక్కడి ప్రజలకు పోడు…

Read More

కాంగ్రెస్ పార్టీ ప్రకటనలపై(యాడ్) నిషేధం..

Telanganaelections2023: అధికార పార్టీల ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ కాంగ్రెస్ పార్టీ ప్రకటనలకు(యాడ్) లను నిషేధించిందని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది. ఈ మేరకు తెలంగాణ కాంగ్రెస్ ట్వీట్ చేసింది.ఓడిపోతామని తెలిసి, బీఆర్ఎస్, బీజేపీ పార్టీలు చేసిన ఒత్తిడి కారణంగానే ఎన్నికల కమీషన్ ప్రకటనలను నిషేదిస్తూ నిర్ణయం తీసుకుందని తెలిపింది. అంతేకాదు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండానే కాంగ్రెస్ ప్రకటనలను ఎన్నికల కమీషన్ నిషేదించిందని కాంగ్రెస్ పార్టీ ఆరోపించింది. అయితే కేవలం మీడియా ఛానెళ్లలో మాత్రమే ప్రకటనలను నిషేదించడంతో…

Read More

భార్యను గెలిపించుకోవాలని ఉత్తమ్ నయా స్కెచ్..

(nancharaiah merugumala senior journalist): గొల్ల మల్లయ్యను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక డెప్యూటీ సీఎం డీకే శివకుమార్, ‘సరిహద్దు నేత’ రఘువీరారెడ్డిని కోదాడ  రప్పించిన ఉత్తమ్‌ రెడ్డి నిజంగా గ్రేట్‌! బీఆరెస్‌ ఎమ్మెల్యే బొల్లం మల్లయ్య యాదవ్‌ ను ఓడించి, భార్య పద్మావతిని గెలిపించుకోవడానికి కర్ణాటక ఉప ముఖ్యమంత్రి డీకే శివకుమార్, ఆంధ్రా పీసీసీ మాజీ నేత, మాజీ మంత్రి, కాంగ్రెస్‌ వర్కింగ్‌ కమిటీ సభ్యుడు ఎన్‌ రఘువీరారెడ్డిని  శుక్రవారం కోదాడ రప్పించారు నలమాడ…

Read More

తెలంగాణలో కాంగ్రెస్‌ కేసీఆర్‌ పార్టీని దాటిపోతోందనడానికి ఆధారాలే లేవు..

Nancharaiah merugumala senior journalist: ‘తెలంగాణలో బీఆర్ఎస్‌ నిస్సందేహంగా ముందుంది, దాని పునాది చెక్కుచెదర లేదు..కాంగ్రెస్‌ పుంజుకుని కేసీఆర్‌ పార్టీని దాటిపోతోందనడానికి ఆధారాలే లేవు’..సెఫాలజిస్ట్‌ సంజయ్‌ కుమార్‌ మాటలు ఎప్పుడూ వాస్తవ పరిస్థితికే అద్దంపడతాయి! ‘‘తెలంగాణలో కేసీఆర్‌ నాయకత్వంలోని బీఆరెస్సే ఖాయంగా ముందంజలో ఉంది. కాంగ్రెస్‌ కోలుకుని ముందుకు పోవడం లేదు. రాష్ట్రంలో 2014 జూన్‌ నుంచీ అమలు చేస్తున్న సంక్షేమ పథకాల కారణంగా బీఆరెస్‌ బలం చెక్కు చెదరలేదు. గ్రామీణ ప్రాంతాల్లో ఈ పార్టీకి విస్తృతమైన…

Read More

రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!

Nancharaiah merugumala senior journalist:   (‘సోనియా తెలంగాణ ఇస్తే–కేసీఆర్‌ దాన్ని దిల్లీ నుంచి మోసుకొచ్చాడు’..తెలంగాణ జనాన్ని నాడు ఆంధ్రోళ్లు సైతం ఇలాంటి ‘బూతు మాటల’తో కించపరచలేదే!రేవంత్‌ నోటికి తాళం వేసే సత్తువ సిద్దిపేట పద్మనాయకులకు లేదేమో మరి!) ………………………………………………………………………….. ‘ఆనాడు కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియా గాంధీ తెలంగాణ ఇవ్వకుంటే టీఆస్‌ నేత కేసీఆర్, ఆయన కొడుకు కేటీఆర్‌ పరిస్థితి అధ్వానంగా ఉండేది,’ అని గురువారం తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఏ రేవంత్‌ రెడ్డి పెద్దపల్లిలో అన్నారు. 1956–2014…

Read More

రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట!

Nancharaiah merugumala senior journalist: (కాంగ్రెస్‌ అనుకూల పరిస్థితుల్లో పార్టీ టికెట్ల పంపిణీలో  రేవంత్‌ రెడ్డి ‘సొంత లాభం ఎంత చూసుకున్నా’ 4 కోట్ల తెలంగాణ జనం పట్టించుకోరట) ================== హైదరాబాద్‌ మెట్రోపాలిటన్‌ ప్రాంతంలోని సనత్‌ నగర్‌ అసెంబ్లీ స్థానంలో బీఆరెస్‌ మంత్రి తలసాని శ్రీనివాస్‌ యాదవ్‌ మీద కోస్తాంధ్ర మూలాలున్న బ్రాహ్మణ మహిళ డాక్టర్‌ కోట నీలిమ వంటి అనామక అభ్యర్థిని నిలబెట్టినా, మేడ్చల్‌ లో మరో మంత్రి చామకూర మల్లారెడ్డిపై తోటకూర వజ్రేష్‌ యాదవ్‌…

Read More

IncTelangana :చనిపోయిన నా శవం మీద కాంగ్రెస్ పార్టీ జెండానే ఉంటుంది: ఎంపీ కోమటి రెడ్డి

IncTelangana: ప్రాణం ఉన్నంతవరకు కాంగ్రెస్ పార్టీలోనే ఉంటానని భువనగిరి ఎంపీ,కాంగ్రెస్ పార్టీ స్టార్ క్యాంపెనర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. కనగల్ మండలం ధర్వేశ్పురంలో మండల కాంగ్రెస్ పార్టీ కార్యకర్తల సమావేశంలో ఎంపీ ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు.ఈ సందర్భంగా కోమటి రెడ్డి మాట్లాడుతూ.. తన పార్లమెంట్ నియోజకవర్గంలో అభివృద్ధి పనుల కోసం ప్రధానమంత్రిని, కేంద్ర మంత్రులను కలిస్తే బిజెపి పార్టీలోకి వెళ్తున్నాడని దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు.ప్రాణం పోయినా బిజెపిలోకి పోనని,ప్రాణం పోయిన తర్వాత తన శవం మీద కూడా కాంగ్రెస్…

Read More

Telangana: సంచలన సర్వే..తెలంగాణలో ఆ పార్టీదే అధికారం..

Telanganapolitics: తెలంగాణ ఎన్నికల షెడ్యూల్ వచ్చేసింది. దీంతో రాష్ట్రంలో ఏ పార్టీ అధికారంలోకి వస్తుందన్న చర్చ మొదలైంది. ఇప్పటికే అభ్యర్థులను ప్రకటించి అధికార బీఆర్ఎస్ ప్రచారంలో దూసుకుపోతోంది. ఎలాగైనా సరే ముడోసరి అధికారం చేపట్టి చరిత్ర సృష్టించాలని కారు పార్టీ భావిస్తోంది. అటు ప్రతి పక్ష బీజేపీ, కాంగ్రెస్ పార్టీలు అభ్యర్ధుల వేటలో నిమగ్నమయ్యాయి. ముఖ్యంగా కర్ణాటకలో గెలిచి జోష్ మీదున్న హస్తం పార్టీ ఇదే ఊపులో  తెలంగాణలో జెండా ఎగరేయలని పట్టుదలతో ఉంది.ఇక కాషాయం పార్టీ…

Read More

తాండూర్ కాంగ్రెస్ అభ్యర్ధిగా పట్లోళ్ల రఘువీర్ రెడ్డి?

Vikarabad: తాండూర్ కాంగ్రెస్ అభ్యర్థిత్వం పై క్లారిటీ వచ్చేసినట్లు తెలుస్తోంది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్న జిల్లా కావడంతో ఆయా నియోజక వర్గాల అభ్యర్ధుల ఎంపిక పై ఆయన ప్రత్యేక దృష్టి సారించారు.  సర్వేల ఆధారంగా  ఇప్పటికే కొడంగల్, వికారాబాద్, పరిగి నియోజక వర్గాల అభ్యర్థులను హస్తం పార్టీ  దాదాపు ఖరారు చేసినట్లు తెలిసింది. ఈ నేపథ్యంలోనే తాండూరు అభ్యర్దిని సైతం ఎంపిక చేసినట్లు నియోజక వర్గంలో చర్చ జరుగుతోంది. రేవంత్ శిష్యుడిగా పేరొందిన…

Read More
Optimized by Optimole