మునుగోడులో దూకుడు పెంచిన బీజేపీ.. మండలాల వారిగా ఇంచార్జ్ లు నియామకం..!

మునుగోడులో బీజేపీ నేతలు దూకుడు మీదున్నారు. పార్టీలోకి చేరికలతో పాటు నియోజకవర్గాలపై ఫోకస్ పెంచారు. మండలాల వారిగా ఇంచార్జ్ లను నియమించారు.ఉప ఎన్నికలో అనుసరించాల్సిన వ్యూహాలపై చర్చించేందుకు ఉప ఎన్నిక బీజేపీ స్టీరీంగ్ కమిటీ కన్వీనర్ వివేక్ వెంకటస్వామి అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అటు కాంగ్రెస్ ,టీఆర్ఎస్ కు చెందిన పలువురు వార్డు సభ్యులు రాజగోపాల్ సమక్షంలో కాషాయ కండువ కప్పుకున్నారు. కాగా సాధారణ అసెంబ్లీ ఎన్నికలకు ముందు ప్రీ ఫైనల్ ఎన్నికగా మునుగోడు ఎన్నికను భావిస్తున్నామన్నారు…

Read More

మునుగోడుపై అమిత్ షా ఫోకస్.. ప్రచారాన్ని స్పీడప్ చేయాలని ఆదేశం..!!

మునుగోడు ఉప ఎన్నికపై కేంద్ర హోంమంత్రి అమిత్ షా ఫోకస్ చేశారు. తెలంగాణ విమోచన అమృతోత్సవాల్లో భాగంగా సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్లో సభ అనంతనం బీజీపీ రాష్ట్ర కోర్ కమిటితో సమావేశమయ్యారు. ఉప ఎన్నికపై అనుసరించాల్సిన వ్యూహాలపై నేతలకు దిశానిర్ధేశం చేశారు.తక్షణమే గ్రామలకు ఇంచార్జ్ లను నియమించాలని సూచించారు.ఉప ఎన్నికపై ఫోకస్ పెంచాలని..ఎప్పుడంటే అప్పుడు అందుబాటులో ఉంటానని స్పష్టంచేశారు. మునుగోడులో బీజేపీ మంచి వాతావరణం ఉందని.. గెలుపే లక్ష్యంగా నేతలంతా పనిచేయాలని అమిత్ షా పిలుపునిచ్చారు. కాగా…

Read More

రేవంత్ బ్లాక్ మెయిలర్.. ఉప ఎన్నిక కేసీఆర్ కుటుంబాన్ని బొంద పెట్టె ఎన్నిక: రాజగోపాల్

టీపీసీసీ చీఫ్ రేవంత్ రెడ్డి పై నిప్పులు చెరిగారు మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఓటుకు నోటు కేసులో అడ్డంగా దొరికిపోయిన వ్యక్తి తనను విమర్శించడం హాస్యాస్పదంగా ఉందన్నారు రాజగోపాల్. రాజకీయల్లోకి రాకముందు చిల్లర దొంగ రేవంత్ రెడ్డి అని ఆరోపించారు. సోనియా గాంధీనీ బలిదేవత తో పోల్చిన వ్యక్తికి..అవినీతి పరుడికి పీసీసీ పదవి ఇవ్వడం దారుణమన్నారు. దొడ్డి దారిలో డబ్బులు ఇచ్చి రేవంత్ పీసీసీ పదవి తెచ్చుకున్నాడని రాజగోపాల్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఇక తనను…

Read More

తెలంగాణలో వేడెక్కిన రాజకీయం.. టీఆర్ఎస్ నేతలపై బీజేపీ ఫైర్!

తెలంగాణలో రాజకీయ వాతావరణం ఒక్కసారిగా వేడెక్కింది. ఇటు బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామయాత్ర లో బీజేపీ ,టీఆర్ఎస్ నేతల మధ్య తీవ్ర ఘర్షణ చెలరేగగా.. అటు మంత్రి జగదీష్ రెడ్డికి..దమ్ముంటే తాను అక్రమాలకు పాల్పడినట్లు నిరూపించాలని మాజీ ఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి సవాల్ విసరడం సంచలనంగా మారింది. టీఆర్ఎస్ నేతలు గుండాల వ్యవహరిస్తున్నారని.. ప్రజాస్వామ్యబద్ధంగా నడుచుకోవాల్సిన పోలీసులు అధికార పార్టీకి కొమ్ముకాస్తున్నారంటూ బీజేపీ నేతలు ఆరోపించడం చర్చనీయాంశమైంది. కాగా మంత్రి జగదీష్ రెడ్డి కి…

Read More

బండిసంజయ్ తో రాజగోపాల్ భేటీ.. గుత్తాసుఖేందర్ పై ఫైర్…!

తెలంగాణ వ్యాప్తంగా చర్చనీయాంశమైన మునుగోడు ఉప ఎన్నికపై క్లారీటీ ఇచ్చారు మాజీఎమ్మెల్యే రాజగోపాల్ రెడ్డి. ఉప ఎన్నిక సెప్టెంబర్ లేదా అక్టోబర్ లో వచ్చే అవకాశం ఉందని స్పష్టతనిచ్చారు.శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి తనపై వ్యాఖ్యలు చేసేముందు నోరు అదుపులో పెట్టుకుని మాట్లాడాలని.. కండువాలు మార్చినంతా ఈజీగా పార్టీలు మార్చే వ్యక్తిని కాదంటూ ఫైర్ అయ్యారు. రాజగోపాల్ వ్యాఖ్యలతో ఉమ్మడి నల్లగొండ రాజకీయం ఒక్కసారిగా వేడేక్కింది. ఇక మూడోవిడత ప్రజాసంగ్రామయాత్ర లో భాగంగా బీజేపీ అధ్యక్షుడు…

Read More

మునుగోడు ఉప ఎన్నికకు సమరశంఖం పూరించిన రాజగోపాల్..

మునుగోడు ఉప ఎన్నిక సమరం ఖరారైంది. ఎమ్మెల్యే పదవికి రాజీనామ లేఖను రాజగోపాల్ స్పీకర్ పోచారంకు సమర్పించడం..ఆయన ఆమోదించడం చకాచకా జరిగిపోవడంతో ఉప ఎన్నిక అనివార్యమైంది. మునుగోడు ప్రజలు చారిత్రాత్మక తీర్పు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నారని.. తన రాజీనామాతో నియోజకవర్గ అభివృద్ధి సాధ్యమని భావించి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. ఇది తన కోసం చేసే యుద్ధం కాదని .. ప్రజల కోసం చేసే యుద్ధమంటూ రాజగోపాల్ ఉప ఎన్నికకు సమరశంఖం పూరించారు. ఇక ఎమ్మెల్యే పదవికి…

Read More

రేవంత్ పై వెంకట్ రెడ్డి ఫైర్.. క్షమాపణలు చెప్పాలని డిమాండ్!

తెలంగాణ కాంగ్రెస్ లో కొత్త పంచాయతీ తెరపైకి వచ్చింది. పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డి పై స్టార్ క్యాంపయినర్ కోమటి రెడ్డి వెంకట్ రెడ్డి ఫైర్ అయ్యారు. తన పేరును సంబోంధిస్తూ అగౌరవపరచారని..కోమటిరెడ్డి బ్రదర్స్ బ్రాందీ షాపులు పెట్టుకునేవాళ్లంటూ రేవంత్ ఇష్టానుసారం వ్యాఖ్యలు చేశారని తక్షణమే క్షమాపణలు చెప్పాలని కోమటిరెడ్డి డిమాండ్ చేశారు. పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి ఇలా మాట్లాడొచ్చా అంటూ వెంకట్ రెడ్డి చేసిన వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో తీవ్ర చర్చకు దారీతీసింది.  …

Read More

బ్లాక్ మెయిలర్ ‘బ్రాండ్ నేమ్’ రేవంత్ : రాజగోపాల్

మునుగోడు రాజకీయం వేడెక్కింది. ఉప ఎన్నిక ఖరారైన నేపథ్యంలో పీసీసీ అధ్యక్షుడు రేవంత్ రెడ్డిపై రాజగోపాల్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. కాంట్రాక్ట్ కోసమే రాజీనామా చేసినట్లు నిరుపిస్తే  రాజకీయ సన్యాసం తీసుకుంటానని.. నిరూపించకపోతే పీసీసీ పదవికి రాజీనామా చేస్తావా? అంటూ రేవంత్ కు సవాల్ విసిరారు రాజగోపాల్. బ్లాక్ మెయిల్ రాజకీయాలకు బ్రాండ్ అంబాసీడర్ రేవంత్ అంటూ ఘూటు వ్యాఖ్యలు చేశారు. సోనియాగాంధీ, వైఎస్సార్ అవమానపర్చిన నేత రేవంత్ ఒక్కడేని.. పీసీసీ పదవితో రాష్ట్రాన్ని దోచుకోవాలని…

Read More

టీఆర్ఎస్ అంతం బీజేపీతోనే సాధ్యం.. ఎమ్మెల్యే పదవికి రాజీనామా :రాజగోపాల్

తెలంగాణ వ్యాప్తంగా సంచలనాలకు కేంద్రబిందువైన మునుగోడు ఉప ఎన్నిక ఊహాగానాలకు తెరపడింది. కాంగ్రెస్ పార్టీ తో పాటు ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నట్లు రాజగోపాల్ ప్రకటించారు. నియోజకవర్గ అభివృద్ధి కోసం రాజీనామా చేస్తున్నట్లు తెలిపారు. నిజాయితీకి మారుపేరైనా తనపై తప్పుడు ప్రచారం చేస్తున్నారని.. తాత్సరం చేయకుండా నిర్ణయాన్ని ప్రకటిస్తున్నట్లు వెల్లడించారు. కార్యకర్తల అభిప్రాయం మేరకు నడుచుకుంటానని.. ఏ పార్టీలో చేరేది వారే నిర్ణయిస్తారని రాజగోపాల్ స్పష్టం చేశారు. అవమానాలు భరించలేను.. ఇక కాంగ్రెస్ పార్టీకి రాజీనామాపై రాజగోపాల్…

Read More

మునుగోడుపై నిధుల వర్షం.. వ్యూహాం మార్చనున్న రాజగోపాల్?

తెలంగాణ వ్యాప్తంగా మునుగోడు ఉప ఎన్నికపై చర్చనడుస్తోంది. ఉప ఎన్నిక వస్తేనే హుజురాబాద్ తరహాలో నియోజకవర్గం అభివృద్ధి చెందుతుందని ఎమ్మెల్యే రాజగోపాల్ ప్రకటించిన .. రెండు రోజుల్లోనే ప్రభుత్వం 33 కోట్లు నిధుల మంజూరుకై ప్రపోజల్స్ పంపాలని ఆదేశాలను జారీచేసింది. ప్రజాసమస్యలపై పలుమార్లు రోడ్లెక్కి, రాస్తారోకోలు చేసినా పట్టించుకోని టీఆర్ఎస్ ప్రభుత్వం.. ఉప ఎన్నిక ప్రచారం ఊపందుకోవడంతోనే నిధులు విడుదలకు సన్నాహాలు చేస్తున్నట్లు నియోజకవర్గంలో చర్చించుకుంటున్నారు. ఇదే అంశాన్ని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లి అనుకూలంగా మార్చుకునేందుకు ఎమ్మెల్యే…

Read More
Optimized by Optimole