సీనియర్ జర్నలిస్ట్ నెల జీతం కోత!

సీనియర్ జర్నలిస్ట్, న్యూస్ యాంకర్ రాజ్ దీప్ సర్దేశాయ్ చేసిన ట్వీట్ వివాదాస్పదం కావడంతో ఇండియాటుడే గ్రూప్ అతని నెల జీతం కోత విధించడంతో పాటు, రెండు వారాల పాటు విధుల నుంచి తప్పించింది . రిపబ్లిక్ డే రోజు రైతుల ట్రాక్టర్ ర్యాలీలో పోలీసుల కాల్పుల్లో రైతు మరణించాడని చేసిన ట్వీట్ వివాదాస్పదం కావడంతో సంస్థ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. ఇక రిపబ్లిక్ డే రోజు అల్లర్ల ఘటనపై దేశవ్యాప్త చర్చ నడుస్తున్న నేపథ్యంలో రాజ్…

Read Full News

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ విడుదల!

తెలంగాణ ఇంటర్ పరీక్షల షెడ్యూల్ ని ఇంటర్ బోర్డు గురువారం విడుదల చేసింది. మే 1 నుంచి 20 వరకు పరీక్షలు నిర్వహించనున్నట్లు బోర్డు వెల్లడించింది. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరగనున్నాయి. ఓకేషనల్ కోర్సులకు కూడా ఇదే షెడ్యూల్ వర్తించనుంది. ఏప్రిల్ 7 నుంచి 20 వరకు ప్రాక్టికల్ పరీక్షలు, ఏప్రిల్ 3 న ఎన్విరాన్మెంట్ పరీక్ష ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది. ఇంటర్ పరీక్షల షెడ్యూల్ :

Read Full News

రాష్ట్రపతి ప్రసంగం బహిష్కరణ : ప్రతిపక్షాలు

రాష్టప్రతి బడ్జెట్ ప్రసంగాన్ని బహిష్కరిస్తున్నట్లు ప్రతిపక్ష పార్టీలు గురువారం ప్రకటించాయి. సాగు చట్టాల వ్యతిరేకంగా రైతుల ఆందోళనల నేపథ్యంలో మద్దతుగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి. ఈ మేరకు కాంగ్రెస్ సీనియర్ నాయకుడు గులాంనబీ మీడియాతో మాట్లాడుతూ.. నూతన సాగు చట్టాల వలన పంటల విక్రయం నిలిచిపోయిందని, దీని ప్రభావం ప్రజా పంపిణీ వ్యవస్థ పై పడుతుందని పేర్కొన్నారు. ఇక చట్టాల ఆమోదంపై ఆజాద్ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం, ప్రతిపక్ష పార్టీలు అభిప్రాయాన్ని పరిగణలోకి తీసుకోకుండా ఏకపక్షంగా…

Read Full News

జులై లో వరుణ్ తేజ్ ‘గని’

మెగా ప్రిన్స్ వరుణ్ తేజ్ నటిస్తున్న తాజా చిత్రం గని జూలైలో విడుదల చేస్తున్నట్లు చిత్ర యూనిట్ వెల్లడించింది. కిరణ్ కొర్రపాటి దర్శకత్వంలో తెరకెక్కిస్తున్న ఈ చిత్రంలో వరుణ్ బాక్సర్ గా కనిపించనున్నాడు. అందుకు సంబంధించిన ఫస్ట్ లుక్ ను కొద్ది రోజుల ముందే విడుదలైంది. ఈ చిత్రాన్ని అల్లు బాబీ, సిద్దు నిర్మిస్తున్నారు. ఇందులో వరుణ్ కి జోడీగా బాలీవుడ్ నటుడు మహేష్ మంజ్రేకర్ కూతురు సయు మంజ్రేకర్ నటిస్తుంది. ఉపేంద్ర , జగపతి బాబు,…

Read Full News

‘పుష్ప’ రిలీజ్ డేట్ వచ్చేసింది!!

స్టైలిష్ స్టార్ అల్లు అర్జున్ క్రియేటివ్ డైరెక్టర్ సుకుమార్ కలయికలో వస్తున్న హ్యాట్రిక్ చిత్రం పుష్ప రిలీజ్ డేట్ వచ్చేసింది. ఆగస్టు 13న చిత్రాన్ని విడుదల చేస్తున్నట్లు పోస్టర్ను చిత్ర యూనిట్ విడుదల చేసింది. తెలుగుతోపాటు మరో నాలుగు భాషల్లో ఈ చిత్రం విడుదల కానుంది. బన్నీసరసన రష్మిక మందన హీరోగా నటిస్తుండగా దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాను నిర్మిస్తుండటం విశేషం. ఇక అల్లు అర్జున్ బర్త్ డే…

Read Full News

ఆందోళన నుంచి తక్షణం తప్పుకుంటున్నాం : వీఎం సింగ్

వ్యవసాయ సాగు చట్టాలకు వ్యతిరేకంగా సాగుతున్న రైతుల పోరాటంలో అనూహ్య పరిణామం చోటు చేసుకుంది. ఈ ఆందోళన నుంచి తక్షణమే తాము తప్పు కుంటునట్లు ఆల్ ఇండియా కిసాన్ సంఘర్ష్ కమిటీ కన్వీనర్ (ఏఐకేఎస్‌సీసీ) వీఎం సింగ్‌ బుధవారం ప్రకటించారు. నాయకత్వం వహిస్తున్న వారి ఉద్దేశం మరోలా ఉందంటూ కీలక వ్యాఖ్యలు చేసిన ఆయన ఈ ఆందోళనను ఇకపై తాము కొనసాగించలేమని పేర్కొన్నారు. రిపబ్లిక్‌ డే రోజున ఘర్షణ ఏమాత్రం ఆమోదయోగ్యం కాదని వ్యాఖ్యానించారు.ఎర్రకోట మీద జెండా…

Read Full News

‘ సైనా’ ఓటిటిలో రిలీజ్!

బ్యాడ్మింటన్ స్టార్ ప్లేయర్ సైనా నెహ్వాల్ జీవిత కథ ఆధారంగా తెరకెక్కుతున్న చిత్రం ‘సైనా'(బయోపిక్). ఈ చిత్రంలో ఆమె పాత్రను బాలీవుడ్ బ్యూటీ పరిణీతి చోప్రా పోషిస్తున్నారు. ఈచిత్రం పూర్తయి ఏడాది కావొస్తున్న కరోనా లాక్ డౌన్ తో వాయిదాపడింది. ఇప్పుడు ‘సైనా’ చిత్రాన్ని ఓటీటీ లో విడుదల చేసేందుకు చిత్ర యూనిట్ ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. కాగా కరోనా లాక్ డౌన్ సడలింపులతో థియేటర్స్ 50 శాతం ఆక్యుపెన్సీతో నడుస్తున్న ప్రేక్షకులు అంతగా సుముఖుతగా…

Read Full News

ఎర్రకోట ఘటన అవమానకరం : పంజాబ్ సీఎం

దేశ రాజధాని ఢిల్లీలో రిపబ్లిక్ డే రోజున ఎర్రకోట వద్ద జరిగిన ఘటన అవమానకరమని పంజాబ్ సీఎం అమరేందర్ సింగ్ అన్నారు. సాగు చట్టాలకు వ్యతిరేకంగా రైతుల తలపెట్టిన ట్రాక్టర్ ర్యాలీ లో హింసాత్మక ఘటనలు చోటుచేసుకోవడం తనను బాధించాయని.. ఎర్రకోటపై రైతులు జెండా ఎగరవేయడం దేశానికి అవమానకరమని ఆయన పేర్కొన్నారు. ఈ ఘటన వెనక ఎవరున్నారన్నది దర్యాప్తు చేయాలన్నారు. ఎర్రకోట ఘటన మాపనే : ఎస్ఎఫ్జె ఎర్రకోట పై జెండా ఎగరవేయడం మాపనే అని నిషేధిత…

Read Full News

దర్శకధీరుడిపై బోనీ కపూర్ ఆగ్రహం.

దర్శకధీరుడు రాజమౌళి ,తనను దారుణంగా మోసం చేశాడని బాలీవుడ్ నిర్మాత బోనీ కపూర్ ఆగ్రహాం వ్యక్తం చేశారు. ఆర్.ఆర్ ఆర్. చిత్రాన్ని దసరా సందర్భంగా అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు ప్రకటించడం ఈ వివాదానికి కారణం. ఓ మీడియా ఇంటర్వ్యూలో పాల్గొన్న బోనీ కపూర్ మాట్లాడుతూ ‘ మైదాన్ చిత్రాన్ని అక్టోబర్లో విడుదల చేస్తున్నట్లు తాను ఆరు నెలల ముందు ప్రకటించానని.. ఇప్పుడు రాజమౌళి బృందం ఎవరిని సంప్రదించకుండా ఆర్.ఆర్.ఆర్. చిత్ర విడుదల తేదీని ప్రకటించడం సబబు కాదని…

Read Full News

సాగు చట్టాలపై ఐఎంఎఫ్ చీఫ్ ఆసక్తికర వ్యాఖ్యలు!

నూతన వ్యవసాయ సాగు చట్టాల గురించి ఐఎంఎఫ్ (అంతర్జాతీయ ద్రవ్య నిది) చీఫ్, ఎకనామిస్ట్ గీత గోపీనాథ్ ఆసక్తికర మంగళవారం వ్యాఖ్యలు చేశారు. మంగళవారం ఓ సమావేశంలో ఆమె మాట్లాడుతూ.. కేంద్రం తీసుకొచ్చిన వ్యవసాయ చట్టాల వలన రైతులకు ఎంతో మేలు జరుగుతుందని .. రైతుల ఆదాయవనరులు పెరగడానికి ఇది ఎంతగానో ఉపయోగపడతాయని ఆమె అన్నారు. భారతదేశ వ్యవసాయ రంగంలో సంస్కరణలు తీసుకు రావాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె పేర్కొన్నారు. సాగు చట్టాలు మార్కెటింగ్ వ్యవస్థకి…

Read Full News
Optimized by Optimole