×

దేశవ్యాప్తంగా స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. ప్రధాని మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించి జాతినుద్దేశించి ప్రసంగించారు. దేశ స్వాతంత్య్ర కోసం ప్రాణాలర్పించిన సమరయోధుల కలలను సాకారం చేయాల్సిన బాధ్యత మనపై ఉందన్నారు ప్రధాని.

స్వాతంత్ర్య దినోత్సవం సందర్భంగా ప్రధాని నరేంద్ర మోదీ ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు.అనంతరం దేశ ప్రజలకు స్వాతంత్ర్య దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
వచ్చే 25ఏళ్ల పాటు యువత దేశ అభివృద్ధి కోసం తమ జీవితాలను అంకితం చేయాలని మోదీ పేర్కొన్నారు. అభివృద్ధి..బానిసత్వం నిర్మూలన..ఘనమైన వారసత్వం..ఏకత్వం.. పౌరహక్కు అనే పంచసూత్రాలపై యువత దృష్టి సారించాలన్నారు.
వరుసగా తొమ్మిదోసారి ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు ప్రధాని మోదీ. అంతకుముందు రాజ్ ఘాట్ కు వెళ్లిన మోదీ.. జాతిపిత గాంధీ సమాధి వద్ద పుష్పాంజలి ఘటించారు.
ఎర్రకోట చుట్టూ 5 కిలోమీటర్ల పరిధిలో ‘నో కైట్‌ ఫ్లై జోన్‌’గా ప్రకటించారు. వేడుకలు జరిగే వేదిక వద్దకు ఎలాంటి గాలిపటాలు, బుడగలు, చైనా లాంతర్లు వంటివి రాకుండా చూసేందుకు ప్రత్యేకంగా 400 మంది సిబ్బందిని వ్యూహాత్మక ప్రాంతాల్లో అవసరమైన పరికరాలతో సిద్ధంగా ఉంచారు.
దేశపు మట్టిపై ఉన్న ప్రేమతో స్వాతంత్య్ర సమర యోధులు వీరోచిత పోరాటం చేసి..   మనకు స్వాతంత్య్రాన్ని సాధించి పెట్టారని ప్రధాని మోడీ గుర్తుచేశారు.
ఎర్రకోటపై జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన ప్రధాని మోదీ
జాతీయ పతాక ఆవిష్కరణ అనంతరం జాతినుద్దేశించి ప్రసంగించిన ప్రధాని మోదీ
స్వాతంత్య్ర వేడుకల నేపథ్యంలో దిల్లీలో భద్రతను కట్టుదిట్టం చేశారు. ఎర్రకోట చుట్టూ 10 వేల మంది పోలీసులు, భద్రతా బలగాలను మోహరించారు.
courtesy: PTI

Author

dhoni.raju219@gmail.com

Related Posts

National: ప్రత్యామ్నాయంతోనే ఏకాభిప్రాయం…!

Delimitation: నియోజకవర్గాల పునర్విభజన, మహిళా రిజర్వేష‌న్ అమలు – కీలకమైన ఈ రెండు అంశాల్లో ఏకాభిప్రాయం సాధన దేశంలో ఒక సవాల్‌గా తయారయింది. వీటితో ముడిపడి ఉన్న కొన్ని సున్నితాంశాల్లో...

Read out all

politics: పుదుచ్చేరిలో ఎన్డీయేకు స్వల్ప ఆధిక్యం..!!

National: పుదుచ్చేరిలో ఏప్రిల్ 9వ తేదిన జరిగే అసెంబ్లీ ఎన్నికల్లో ఎన్డీయే స్వల్ప మెజారిటీతో అధికారంలోకి వచ్చే అవకాశాలు ఉన్నట్లు పీపుల్స్ పల్స్ రీసర్చ్ సంస్థ నిర్వహించిన ప్రీ పోల్...

Read out all

National:58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు…!!

Maharashtra: సెక్స్.. మత్తు.. బ్లాక్‌మెయిల్‌ 58 మహిళల జీవితాలను నాశనం చేసిన కీచక జ్యోతిష్యుడు… మహిళా కమిషన్ చైర్‌పర్సన్‌కూ లింకులు బయటపడ్డాయా? మహారాష్ట్రలోని లో సంచలనం రేపిన ఘోర ఘటన...

Read out all

Assam: అస్సాంలో హ్యాట్రిక్ దిశగా బీజేపీ..!!

Assam election: ఈశాన్య రాష్ట్రం, అస్సాంలో అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న తరుణంలో ప్రజలు ఎటువైపు మొగ్గు చూపుతున్నారో ఇప్పటికే స్పష్టంగా తెలుస్తోంది. 2026 అసెంబ్లీ ఎన్నికలు మార్పు కోసం కాకుండా...

Read out all

Appolitics: బాబుది నితీశ్ బాటేనా… ?

Appolitics: బిహార్ ముఖ్యమంత్రి నితీశ్‌కుమార్ బాటలో ఏపీ సీఎం చంద్రబాబు నడువనున్నారా? రాష్ట్రంలో తనయుడు లోకేశ్‌కు పట్టంగట్టి రాజ్యసభ ద్వారా తాను జాతీయ రాజకీయాలకు వెళతారా? వేగంగా మారుతున్న రాజకీయ...

Read out all

Keralaelection: కమ్యూనిస్టు కూటమికి కేరళలో ఎదురీత…!

Kerala: దశాబ్దాలుగా ఎడతెగని దళిత మద్దతుతో పాలన సాగిస్తూ వస్తున్న కమ్యూనిస్టు సంకీర్ణ సర్కారుకు కేరళలో కష్టాలు మొదలయ్యాయి. రాబోయే అసెంబ్లీ ఎన్నికల్లో వారిది నల్లేరు మీద బండి నడక...

Read out all
Optimized by Optimole