Chandrababu: ఏ నమూనాతో బాబు ఏలుతారో..?
Chandrababu: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఏ కొత్త పరిపాలనను చవి చూడబోతోంది? అది, సుదీర్ఘ రాజకీయ అనుభవం గడించిన ఏపీ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడి తాజా ఆలోచనా సరళిని, ఆచరణని బట్టి ఉంటుంది. విభజన తర్వాతి అవశేషాంధ్రప్రదేశ్కు రెండో సీఎం అయిన తాజామాజీ ముఖ్యమంత్రి వై.ఎస్. జగన్మోహన్రెడ్డి, అసెంబ్లీ ఓట్ల లెక్కింపుకు ముందు ఓ ‘వ్యాఖ్య’ చేశారు. ఆయనన్నట్టే… దేశాన్ని సంభ్రమాశ్చర్యాలకు గురిచేసే ఫలితాలను (164/175) ఏపీప్రజలిచ్చారు, కానీ, జగన్ ఆశించినట్టు అది ఆయనకు అనుకూలంగా కాదు. ఫలితంగా…