కాళేశ్వరం ప్రాజెక్ట్ సందర్శనకు అనుమతి కోరుతూ సీఎస్ కు బండి లేఖ..!

కాళేశ్వరం ప్రాజెక్ట్  సందర్శనకు సెప్టెంబరు మొదటి వారంలో అనుమతి ఇవ్వాలని కోరుతూ  బీజేపీ స్టేట్ చీఫ్ బండి సంజయ్   ప్రభుత్వ  ప్రధాన  కార్యదర్శి సోమేష్ కుమార్ కి  లేఖ రాశారు. కాళేశ్వరం ప్రాజక్టు నిర్మాణం, వరదలలో మునకపై సమాచారం తెలుసుకోవాలనుకుంటునట్లు లేఖలో ఆయన పేర్కొన్నారు . ప్రాజెక్టు నిర్మాణంపై తమకున్న అనుమానాలను నివృత్తి చేసుకోవడంతో పాటు.. భారీ వరదలతో కాళేశ్వరం ఎత్తిపోతల ప్రాజెక్టులో మోటార్లకు  ఏర్పడిన నష్ణాన్ని పరిశీలించి నిజానిజాలను ప్రజలకు తెలియజేయడమే లక్ష్యంగా పర్యటన చేపట్టబోతున్నట్లు…

Read Full News

నారప్ప చిత్రీకరణ పూర్తయింది!

విక్టరీ వెంకటేష్ కథానాయకుడిగా నటిస్తున్న ‘నారప్ప’ చిత్రం షూటింగ్ పూర్తయింది. తమిళంలో విజయం సాధించిన ‘అసురన్’ తెలుగు రీమేక్ గా రూపొందుతున్న చిత్రమిది. డి. సురేష్ బాబు , కలైపులి ఎస్. థాను నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. వెంకటేష్ కి జోడిగా ప్రియమణి నటిస్తున్నారు. ఈ చిత్రానికి సంబంధించి హీరో వెంకటేష్ ట్విట్టర్లో స్పందిస్తూ.. నారప్ప తో ప్రయాణం పూర్తయింది,  సినిమా విడుదల కోసం మనమందరం వేచి చూద్దాం..అంటూ ట్వీట్ చేశాడు. కాగా ఈ చిత్రం వేసవి కానుకగా …

Read Full News

spiritual: మౌనం_ మనిషిని మనిషిగా నిలబెట్టే మహా సాధన..!!

Spiritual: BY anrwriting ✍🏽/ senior journalist  మౌనం ఒక మంచి అలవాటు మాత్రమే కాదు…అది ఒక జీవన శైలి, ఒక ఆత్మశుద్ధి మార్గం. రోజూ కేవలం అరగంట మౌనంగా ఉండటం అలవాటు చేసుకుంటే శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత మాత్రమే కాదు,మన ఆశలు, ఆశయాలు, కలలు, కోరికలు సైతం నెరవేరుతాయంటే నమ్మగలమా?సాధారణంగా నమ్మలేం. కానీ ఇది అనుభవసిద్ధమైన సత్యం. ప్రయత్నిస్తే తప్పక తెలుస్తుంది. మౌనం ఎంత శక్తివంతమైందో. మన రోజువారీ జీవితాన్ని ఒకసారి గమనించండి.ఉదయం లేచిన…

Read Full News

‘టీంఇండియా’ పై ఆసీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!

ఆస్ట్రేలియాలో టీమిండియా టెస్ట్ సిరీస్ గెలవడంపై అజట్టు టెస్ట్ కెప్టెన్ టీం పైన్ ఆసక్తికరమైన వ్యాఖ్యలు చేశాడు. తమ ఏకాగ్రతను దెబ్బతీయడం వలనే టీమిండియా తమపై టెస్ట్ సిరీస్ గెలవగలిగిందిని పైన్ అన్నాడు. గతేడాది ఆస్ట్రేలియాలో పర్యటించిన భారత జట్టు 2-1తో టెస్ట్ సిరీస్‌ను గెలిచిన విషయం తెలిసిందే. విరాట్ కోహ్లీ గైర్హాజరీలో యువ ఆటగాళ్లు సత్తా చాటడంతో దశాబ్దాల తర్వాత ఆస్ట్రేలియా జట్టును  వారి దేశంలో ఓడించిన జట్టుగా భారత్ చరిత్ర సృష్టించింది. తాజాగా ఓ…

Read Full News

రామ మందిర నిర్మాణానికి జనసేనాని భారీ విరాళం!

అయోధ్య రామమందిరం నిర్మాణానికి జనసేన అధ్యక్షులు శ్రీ పవన్ కళ్యాణ్ గారు రూ. 30 లక్షలు విరాళంగా ఇచ్చారు. ఈ మేరకు తిరుపతి లో రాష్ట్ర ఆర్.ఎస్.ఎస్. ముఖ్యులు శ్రీ భరత్ జీ గారిని కలిసి చెక్కును అందజేశారు. అతనితో పాటు వ్యక్తిగత సిబ్బంది సైతం ఆలయానికి విరాళమిచ్చారు( రూ. 11000) . ఈ కార్యక్రమంలో మాజీ మంత్రి బీజేపీ నాయకులు డాక్టర్ కామినేని శ్రీనివాస్ తో పాటు తదితరులు పాల్గొన్నారు. అనంతరం తిరుపతి ఉప ఎన్నిక…

Read Full News

బిగ్ బాస్ 5 నుంచి ప్రియాంక సింగ్ ఔట్!

తెలుగు ప్రేక్షకులకు ఎంతగానో ఆక్టుకుంటున్న రియాల్టీ షో బిగ్ బాస్ సీజన్_5 చివరి అంకానికి చేరుకుంది. తాజాగా జరిగిన ఎలిమినేషన్ ప్రక్రియలో ట్రాన్స్ జెండర్ ప్రియాంక సింగ్ అలియాస్ పింకీ షో నుంచి ఎలిమినేట్ అయ్యారు. ఎటువంటి అంచనాలు లేకుండా హోస్లో అడుగుపెట్టిన పింకీ 90 రోజుల పాటు ఉండటం మామూలు విషయం కాదు. జబర్దస్త్ వంటి షోల ద్వారా పాపులర్ అయిన ఆమె సెప్టెంబర్ 5 వ తేదీన మొదలైన సీజన్5లో 9 వ కంటేస్టెంట్గా…

Read Full News

ఎస్ఈసీ మాటలు వింటే చర్యలు తప్పవు: మంత్రి రామచంద్రా రెడ్డి

ఎస్ఈసీ(ఎన్నికల కమిషనర్) మాటలు విని తప్పుడు నిర్ణయాలు తీసుకుంటే,బ్లాక్ లిస్టులో పెడతామని కలెక్టర్లు, పంచాయతీ ఎన్నికల అధికారులకు మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హెచ్చరించారు. శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. మేము ఎన్నికల కమిషనర్ మాట వింటాం.. ఆయన చెప్పినట్లు చర్యలు తీసుకుంటాం అంటే.. పరిణామాలు తీవ్రంగా ఉంటాయని పెద్దిరెడ్డి అన్నారు. కాగా చిత్తూరు, గుంటూరు లో ఏకగ్రీవాలు అపమని ఎన్నికల కమిషనర్ అంటున్నారు. అందుకు సహకరిస్తూ, తొత్తులుగా పనిచేసే అధికారుల అందరిని గుర్తుపెట్టుకుంటామని…

Read Full News

కొత్త సంవత్సరం వేడుకలు శాంతియుతంగా జరుపుకోవాలి: ఎస్పీరాజేశ్వరి

నల్లగొండ:  నల్గొండ జిల్లా ప్రజలందరికీ  నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలుపుతూ ఎస్పీ రెమా రాజేశ్వరి ప్రకటన విడుదల చేశారు. కొత్త సంవత్సరం వేడుకలను శాంతియుత వాతావరణంలో జరుపుకోవాలని సూచించారు. ఎలాంటి అవాంచనీయ సంఘటనలు జరగకుండా చూడాలన్నారు. డిసెంబర్ 31వ తేది రాత్రి 10 గంటల నుంచి  స్పెషల్ డ్రంకెన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్ల తెలిపారు. డ్రంకెన్ డ్రైవ్ లో పట్టుబడ్డ వారిపై కేసు నమోదు చేసి బైయిండోవర్ చేయడం  జరుగుతుందని ఎస్పీ స్పష్టం చేశారు.   కాగా న్యూఇయర్…

Read Full News

Telangana: త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన..!

• త్వరలో ఎస్సీ వర్గీకరణపై జిల్లాల్లో ఏక సభ్య కమిషన్ పర్యటన •  నివేదిక అందించేందుకు కసరత్తు చేస్తున్న కమిషన్  • వచ్చే నెల రెండో వారంలో ముగియనున్న గడువు రాపర్తి వినోద్: ఎస్సీల్లో అట్టడుగు స్థాయిలో ఉండి వినతులు అందించలేని వారికోసం చొరవ చూపించాలని ఎస్సీ వర్గీకరణపై ఏర్పాటు చేసిన ఏక సభ్య కమిషన్ కోరింది. త్వరలోనే ఉమ్మడి జిల్లాల్లో  పర్యటన ఉండబోతుందని తెలిపింది. అన్ని వర్గాల నుంచి వినతులు సేకరించిన తర్వాత వారిలో ఒకే…

Read Full News

ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు : ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌

ఆడపడుచులందరికీ మహిళా దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు జ‌న‌సేన అధినేత ప‌వ‌న్‌ క‌ళ్యాణ్‌. స్త్రీమూర్తి సేవ‌లు వెల‌క‌ట్ట‌లేనివని..మహిళామణి లేని ఇల్లు దీపం లేని కోవెల వంటిదని.. ఇంతటి మహత్తరమైన వనితా లోకానికి మహిళా దినోత్సవ శుభాకాంక్షలు అంటూ ప్ర‌క‌ట‌న విడుద‌ల చేశారు. ఎక్కడ స్త్రీలు గౌరవించబడతారో అక్కడ దేవతలు కొలువై ఉంటారని మనం చెప్పుకొంటుంటామని గుర్తు చేశారు. స్త్రీలను గౌరవించే చోట శాంతిసౌభాగ్యాలు విలసిల్లుతాయ‌ని ధృడంగా విశ్వసిస్తాన‌ని తెలిపారు. స్త్రీ సంపూర్ణ సాధికారిత సాధించడానికి, వారు స్వేచ్ఛగా జీవించడానికి…

Read Full News
Optimized by Optimole